Live Streaming
GMC Global Alumni Home Coming 2026

  1. Home
  2. GMC Global Alumni Home Coming 2026

Live Streaming will be available on 28th, 29th and 30th January 2026.

Live Coverage Timings:
28th - 6PM onwards, 29th - 9AM to 11AM & 6PM onwards
30th - 9AM to 1PM & 5PM onwards

GMCANA Song

*Pallavi:*

కానూరి జింకానా యంసీహెచ్ సదనం
మాతాశిశువుల చిరునవ్వు వదనం
ఆరొందల పడకల జీజీహెచ్ సోపానం
సదా రోగుల సేవలో సంసిద్ధ పావనం
లేదు ఇక్కడ మతం కులం
మాది సమస్త ప్రాణికులం
ఊరి మధ్యన సైనికులం
ఊపిరి పోసే సేవకులం
జయహో జింకానా వైద్య రత్నమా
సాహో జీజీహెచ్ దానదీపమా
జయహో జింకానా వైద్య రత్నమా
సాహో జీజీహెచ్ దానదీపమా

*Charanam 1:*

రోగిరోగమే సిఫార్సు ఉత్తరం
బేగి సేవలందించు సత్వరం
శస్త్రచికిత్సలలో మేలు మహత్తరం
హస్తవాసిలో బాగు బృహత్తరం
ఆరోగ్య సేతువా, అనారోగ్య శతృవా, ఐసీయూ దీపమా
ప్రాణానికి ప్రాణమా
జయహో జింకానా వైద్య రత్నమా
సాహో జీజీహెచ్ దానదీపమా
జయహో జింకానా వైద్య రత్నమా
సాహో జీజీహెచ్ దానదీపమా

*Charanam 2:*

అటు దేవుడు ఇటు మనిషీ
కాని వైద్యుడొక వింత జీవి
మనిషిని చిరంజీవిగ చేసి
ఆనందించే సిరంజీవి
వైద్య సార్వభౌమా, నిస్వార్థ శస్త్రమా, జబ్బులపై అస్త్రమా
ఆరోప్రాణమైన నేస్తమా
జయహో జింకానా వైద్య రత్నమా
సాహో జీజీహెచ్ దానదీపమా
జయహో జింకానా వైద్య రత్నమా
సాహో జీజీహెచ్ దానదీపమా

Videos

Image Gallery

Total No of Visitors: website counter